Heart Attack : పిడుగురాళ్లలో 8వ తరగతి విద్యార్థికి గుండెపోటు
ఏపీలోని పల్నాడు(palnadu) పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్లో విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో 8వ తరగతి విద్యార్థి కోటిస్వాములు మృతి చెందాడు. రాత్రి భోజనం(Supper) చేశాక ఊపిరాడటం లేదని విద్యార్థి కోటిస్వాములు ఫ్రెండ్స్(Friends)కి చెప్పాడు. దీంతో హాస్టల్ వార్డెన్(Hostel warden) కోటిస్వాములను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కోటిస్వాములు చనిపోయాడు.
Heart Attack : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం(Andra Pradesh State)లో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటు(Heart Attack)తో 8వ తరగతి విద్యార్థి(8th class student) మృతి చెందాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..ఏపీలోని పల్నాడు(palnadu) పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్లో విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో 8వ తరగతి విద్యార్థి కోటిస్వాములు మృతి చెందాడు. రాత్రి భోజనం(Supper) చేశాక ఊపిరాడటం లేదని విద్యార్థి కోటిస్వాములు ఫ్రెండ్స్(Friends)కి చెప్పాడు. దీంతో హాస్టల్ వార్డెన్(Hostel warden) కోటిస్వాములను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కోటిస్వాములు చనిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత వైద్యులు పరీక్షించి కోటి స్వాములు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో కోటిస్వాములు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకప్పుడు 60ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి. నేడు, 40 ఏండ్లలోపు వారికి గుండెజబ్బులు(heart disease) వస్తున్నాయి. చాలామంది రక్తపోటు(BP), మధుమేహం(Diabetes) లాంటి సమస్యలూ లేకపోయినా గుండెపోటు బారినపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తూ ఓ కారణం కావచ్చు. యువతరం గుండెచుట్టూ కాపుకాసిన శత్రువులు ఇవే.. ధూమపానం,వంశ పారంపర్యం, చెడు కొలెస్ట్రాల్, ఆహారపు అలవాట్లు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం ప్రధానంగా గుండెపోటుకు కారణాలు