HYD: గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్లలోని షాపింగ్ మాల్స్‌లో శనివారం జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఏఎంసీ శ్రావణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఈ ప్రాంతాలను పరిశీలించారు. మాల్స్‌లో చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్సులు, ఆస్తిపన్ను బకాయిల కోసం దుకాణాలను తనిఖీ చేశారు.