NGKL: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని ఆదివారం నాగర్ కర్నూల్ ఎంపీ, రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై ఆమె ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.