పెద్దపల్లి: దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతరలో దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 25న బహిరంగ వేలం మధ్యాహ్నం 1గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి ముద్దసాని శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలవారు లడ్డూ, పులిహోర, ప్రసాదం అమ్మకానికి రూ.50000, ప్యాలాలు, పుట్నాలు అమ్మకానికి రూ.10000 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.