ASF: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు ఎన్నికలు జరపాలని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావుకి పేపర్ మిల్ మజ్దార్ యూనియన్(CITU) ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి సిర్పూర్ పేపర్ మిల్లులో ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంతో యాజమాన్యం కార్మికుల అనేక హక్కులను కాలరాస్తోందని యూనియన్ జనరల్ సెక్రెటరీ రాజన్న పేర్కొన్నారు.