MBNR: గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మూడా ఛైర్మెన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. రామచంద్రాపురం, మాచన్ పల్లి గ్రామాలలో MGNREGS నిధులతో నిర్మించనున్న సీసీరోడ్డు, యాదవ కమ్యూనిటీ హాల్ పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కృషితో ప్రజాపాలనలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.