KNR: దేశంలోనే ప్రసిద్ధి చెందిన అజ్మీర్ దర్గాకు హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ చాదర్ సమర్పించారు. గురువారం గాంధీభవన్లో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితర నాయకులతో కలిసి ముస్లిం సోదరుల సమక్షంలో దర్గాకు చాదర్ అందజేశారు. ప్రజా పాలనలో ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు.