BDK: గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య అన్నారు. జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులకు శనివారం వారు మద్దతు పలికారు. పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే కాలంలో సమ్మెకు దిగుతామన్నారు.