MDK: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం ఆదివారం నాడు హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన మన్నే వెంకట్ స్వామిని తపస్ రాష్ట్ర అడిట్ కమిటీ కో-కన్వినర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ అధికారికంగా ప్రకటించారు.