MBNR: చిన్నచింతకుంట మండలంలోని తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం మండలంలోని పలు గ్రామాల ప్రజలు గురువారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలు లేని గ్రామాలుగా తమ ప్రాంతాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.