MDK: కుక్క దాడిలో బాలుడికి గాయాలైన ఘటన హవేలి ఘనపూర్ మండలం వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్సింగ్ తండాలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాలు.. తండాకు చెందిన శ్రీనివాస్ కుమారుడు సాయిదీప్ తండాలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఆడుకునే సమయంలో కుక్క దాడి చేయగా సాయిదీప్కు గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.