PDPL: ఫిబ్రవరి 12న నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుపతలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు గోదావరిఖని ఐఎఫ్టీయూ కార్యాలయంలో శనివారం TSUS నాయకులు నీరటి రాజయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ నాయకులు హాజరయ్యారు.