మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎటువంటి అవకతవకలకు తావు ఇవ్వకూడదని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి అన్నారు. మార్కెట్ యార్డ్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ పాల్గొన్నారు.