KMM: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రేపు అశ్వారావుపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ వట్టి వెంకటరావు సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. కావున సంబంధిత అధికారులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.