JN: పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన లకావత్ శ్రీను మృతి చెందాడు. మేకల తండా వాసుల ఆధ్వర్యంలో లకావత్ శ్రీనుకు న్యాయం జరగాలని పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై గిరిజనులు ధర్నా నిర్వహించారు. సీఐ, ఎస్సైలతో పాటు మరో ఆరుగురిని కఠినంగా శిక్షించాలని గిరిజనులు డిమాండ్ చేశారు.