WGL: మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ పరిధిలోని పుప్పాలగుట్టలో గల శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అర్చకులు శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్థానిక భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.