BHPL: జిల్లా ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే IPS పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ గారు 21 మంది బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదుల విచారణను వేగవంతం చేయాలని అన్నారు.