KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం ఉదయం 400 క్యూసెక్కులు నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఏఈ శివప్రసాద్ వెల్లడించారు. ప్రధాన కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల ఔట్ ఫ్లో అవుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,404.98 అడుగులు (17.773 టీఎంసీలు) ఉందన్నారు.