SDPT: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్ పంపింగ్ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి 5.5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించినట్లు తెలిపారు.