కరీంనగర్: సర్వేల పేరిట వ్యవసాయ శాఖ అధికారులను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని మంగళవారం కరీంనగర్ మండల వ్యవసాయ శాఖ అధికారులు చామనపల్లిలో రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ క్రాప్ సర్వేను క్లస్టర్‌లోని ఓఏఈఓకు 5 నుంచి 8 గ్రామాలు, 6 వేల నుంచి 10 వేల ఎకరాలు చేయడం కష్టంగా మారిందని అన్నారు.