SRCL: సిరిసిల్ల జిల్లాలోని మూగజీవుల టోల్ ఫ్రీ నంబర్ 1962 వాహనాల సిబ్బందికి 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో జీతాలు ఇవ్వండి సారూ అంటూ మొరపెట్టుకున్నారు. జిల్లా ప్రోగ్రాం ఇంఛార్జి సలీం మాట్లాడుతూ ఒక్కొక్క వాహనానికి నలుగురు సిబ్బంది ఉండగా రూ.56 వేల జీతాలు రావాల్సి ఉందన్నారు. 3 నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబాలు పోషించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.