PDPL: గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్ గోదావరిఖని పట్టణ శివారు మిలీనియం క్వార్టర్స్ సమీపంలోని చెట్లలో గంజాయి సేవిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ ఇంద్ర సేనా రెడ్డి తెలిపారు. వారి నుంచి 2 బైకులు, 2 సెల్ ఫోన్లు, 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి తాగినా, సరఫరా చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.