HYD: కింగ్ కోఠి పరిధిలోని హౌస్ నంబర్ 3–5–784/3లో అక్రమంగా గిడ్డంగి ఏర్పాటు చేశారని, ఇందులో ప్లాస్టిక్ మెటీరియల్, కర్టెన్లు ఉన్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. గిడ్డంగిలో ఉన్న సామాగ్రికి త్వరగా మంటలు అంటుకునే అవకాశం ఉన్నదని, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన యంత్రాంగం యాజమానికి నోటీసు జారీ చేసింది.