రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ్ పథకం ద్వారా సేఫ్టీ కిట్లు మంజూరైంది. ఈ కిట్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని గీతా కార్మికులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.