బోధన్ పద్మశాలి సంఘానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లోల శంకర్ ఉన్నతాధికారుల ఆదేశాలతో పొతంగల్ మండల విద్యాశాఖ అధికారిగా పదోన్నతి పొందారు. దీంతో శుక్రవారం ఆ సంఘ నాయకులు తట్టికోట్లోని మార్కండేయ పద్మశాలి సంఘంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దేవిదాస్, బీజేపీ కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్, సభ్యులు రాములు, సురేష్ పాల్గొన్నారు.