KMR: ఇంటి నిర్మాణం కోసం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేయూతను అందజేశారు. బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మునాఫ్ ఇంటి నిర్మించుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఈ విషయాన్ని స్థానికులు గోవర్ధన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇంటి నిర్మాణానికి కావలసిన ఇటుకలు ఇస్తానని గోవర్ధన్ హామీ ఇచ్చి వాటిని పంపించారు.