SDPT: అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేస్తామని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో నర్సారెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అర్హత కలిగిన ప్రతిరైతుకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు.