MBNR: కోయిల్ సాగర్ ప్రాజెక్టు మళ్లీ జల పరవళ్లు తొక్కుతోంది. పెద్దవాగు నుంచి భారీగా వరద వస్తుండటంతో బుధవారం నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 32.5 అడుగుల వద్ద ఉంచుతూ వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.