New feature in WhatsApp.. Very useful in group chat
New feature: స్మార్ట్ ఫోన్(SmartPhone) ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్(WhatsApp) వాడుతుంటారు. పర్సనల్ చాటింగ్ కోసమే కాకుండా గ్రూప్స్‌లో చాటింగ్ నిర్వహిస్తుంటారు. కొన్ని సార్లు యాక్టీవ్‌గా లేని సందర్భాల్లో గ్రూప్‌లో జరుగుతున్న చర్చల్లో పాల్గొనలేము. ఏదో పనిలో ఉండి తరువాత గ్రూప్ ఓపెన్ చేస్తే.. బోలెడు మెసేజ్ కనిపిస్తాయి. అది చూస్తే అస్సలు క్లారిటీ ఉండదు. పైకీ స్క్రోల్ చేస్తేగాని అసలు విషయం తెలియదు. అలా చేస్తే కొన్ని సార్లు ముఖ్యమైన విషయాలను కూడా మిస్ అవుతాము. ఈ కన్ఫ్యూజన్ పోవడానికే వాట్సాప్ కొత్త ఫీచర్(New feature)ను తీసుకొచ్చింది. దీంతో గ్రూప్‌లో ఏ అంశం మీద చర్చ జరుగుతుందో అందరికి తెలుస్తుంది.
వ్యక్తిగత చాట్లు, గ్రూపుల్లో జరిగే చాట్‌ను మిస్ అవ్వకుండా ఉండేందుకు వాట్సాప్ పిన్(Pin) ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్‌లోని సభ్యులు ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉండేందుకు దీన్ని గ్రూప్ అడ్మిన్లు ఉపయోగించవచ్చు. మెసేజ్‌లే కాకుండా, వాట్సాప్ పోల్స్, ఫొటోలు, ఎమోజీలకు కూడా పిన్ చేయచ్చు. ఇలా పిన్ చేస్తే చాటింగ్ పై భాగంలో కనిపిస్తాయి. వాట్సాప్‌లో చాటింగ్ విభాగంలో పిన్ చేయడం అనేది ఇదివరకే చాలా మందికి తెలుసు. ఇప్పుడు చాట్ లోపల టాపిక్స్‌కు పిన్ చేయడం అనేది కొత్తగా వచ్చిన ఫీచర్. ఇది డిఫాల్ట్‌గా 7 రోజుల వరకు ఉంటుంది. కావాలంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. టైమ్ లిమిట్ అవగానే అన్‌పిన్ అవుతుంది. ఎదైనా చాట్ ముఖ్యమైంది అనుకుంటే.. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి మోర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో పిన్ ఫీచర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మెసేజ్ పిన్ అవుతుంది. వద్దు అనుకుంటే అన్‌పిన్ చేయొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ బీటా వెర్షన్లో కొందరికి అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలినవారికి అప్ డేట్ అవనుంది.