ఇటీవల యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తర్వాత ఐఫోన్ 16 సిరీస్‌లను విడుదల చేయనుందని..వీటి ఫీచర్స్ కూడా పూర్తిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 16: ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ ఇటీవల ఐఫోన్ 15(iPhone 15) సిరీస్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఐఫోన్ 15(iPhone 15) సిరీస్ స్మార్ట్ఫోన్లు తొందరగా హీట్ కావడంతో చాలామంది యూజర్స్ ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఐఫోన్ 15(iPhone 15) సిరీస్ రాగానే.. కొందరు టెక్ ప్రియులు ఐఫోన్ 16(iPhone 16) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఐఫోన్ 16(iPhone 16) స్మార్ట్‌ఫోన్స్ ఎప్పుడు వస్తాయి. ఇందులో ఫీచర్స్ ఇలా ఉంటాయనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈసారి యాపిల్ కంపెనీ ఐఫోన్ 16(iPhone 16) సిరీస్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెచ్జెడ్గా ఉండనుంది. ఇప్పటి వరకు అన్ని ఐఫోన్లలో రిఫ్రెష్ రేటు 60 ఉంది. తక్కువగా ఉందని చాలా మంది యూజర్లు చెప్పడంతో రిఫ్రెష్ రేటుని పెంచుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఐఫోన్ స్క్రీన్ సైజ్ కూడా పెంచనుంది. ఐఫోన్ 15 సిరీస్ స్టాండర్డ్, ప్లస్ ఫోన్ల డిస్ప్లేలు 6.1, 6.7 అంగుళాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాలతో లార్జ్ డిస్ప్లే రావచ్చు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా.. ఐఫోన్ 15 సిరీస్ డిస్‌ప్లేలనే కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ సిరీస్‌లో హోమ్ బటన్‌లో ఉండే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను ఐఫోన్ 15 సిరీస్‌తో మళ్లీ పరిచయం చేయాలనుకున్నా.. వీలు కాలేదు.
కానీ ఈసారి ఐఫోన్ 16 ప్రో మోడల్లో సాలిడ్-స్టేట్ బటన్లు ఉండవచ్చని అంటున్నారు. అలాగే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో టెక్నాలజీ 3x నుంచి 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను చేర్చాలని కంపెనీ అనుకుంటుంది. ఐఫోన్ 16 సిరీస్‌లో నెక్స్ట్ జనరేషన్ చిప్ సెట్ డిజైన్ చేసే అవకాశం కూడా ఉంటుందట. ఈసారి ఐఫోన్ 16 ప్రోలో A18 ప్రో చిప్‌ను కూడా ఉపయోగిస్తారట.