గిల్ గైర్హాజరుతో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ మొదటి టెస్టులో భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే గిల్ తిరిగి జట్టులోకి వచ్చినా కూడా సర్ఫరాజ్ రెండో టెస్టులో కచ్చితంగా ఆడతాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘కరుణ్ నాయర్ లాగా సర్ఫరాజ్‌ను దురదృష్టం వెంటాడదు. ప్రస్తుతం ఈ అతడు తుది జట్టులో ఉండటం అత్యవసరం’ అని పేర్కొన్నాడు. కాగా, 2017లో ENGతో త్రిశతకం బాదిన తర్వాతి టెస్టులో నాయర్‌కు జట్టులో చోటు దక్కలేదు.