న్యూజిలాండ్‌తో వరుసగా రెండు టెస్టులను ఓడిపోవడంతో టీమిండియా విమర్శలను ఎదుర్కొంటోంది. దీంతో మూడో టెస్టు జరిగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలిరోజు నుంచే బంతి గింగరాలు తిరిగిలే పిచ్ తయారుచేయాలని క్యూరేటర్‌ను టీమిండియా మేనేజ్మెంట్ కోరిందని సమాచారం అందుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ టెస్టు గెలవడం టీమిండియాకు తప్పనిసరిగా మారింది.