శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక ఆటగాళ్లలో చందీమల్ (116), కమిందు మెండిస్(182*), కుశల్ మెండిస్(106*) సెంచరీలతో చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీ స్కోర్ సాధించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 22 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.