సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో.. భారత మేనేజ్ మెంట్ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.