భారత ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం రేపింది. మిజోరం ప్రీమియర్ లీగ్‌లో పలువురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. దీంతో మిజోరం ఫుట్‌బాల్ సమాఖ్య విచారణ చేపట్టి ఫిక్సింగ్‌తో సంబంధమున్న 24 మంది ఆటగాళ్లపై, మూడు క్లబ్‌లపై నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సూత్రధారులుగా వ్యవహరించిన ఇద్దరిపై ఏకంగా జీవితకాలం నిషేధం విధిస్తూ మిజోరం ఫుట్‌బాల్ సమాఖ్య తీర్మానించింది.