మనలో చాలా మంది డయాబెటిస్తో బాధపడుతుంటారు. అయితే పచ్చి అరటితో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీనిలో షుగర్ పర్సంటేజ్ చాలా తక్కువ, రెస్టిస్టెంట్ స్టార్చ్ కూడా ఉండటంతో దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దీనిలో బౌండ్ ఫెనోలిక్స్ అధికంగా ఉండటం వల్ల మంచి బ్యాక్టీరియా పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పచ్చి అరటిలో ఉండే ఫైబర్ కారణంగా క్రమంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.