ICC టెస్ట్ ర్యాంకుల్లో టాప్-1 బౌలర్‌గా దక్షిణాఫ్రికా స్టార్ కగిసో రబాడ (860 పాయింట్లు) నిలిచాడు. ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న భారత స్టార్ పేసర్ బుమ్రా 3వ స్థానానికి పడిపోయాడు. ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ (847) 2వ స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత యువ బ్యాటర్ జైస్వాల్ (790) 3వ స్థానంలో నిలవగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (903) టాప్‌లో, కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (813) 2వ స్థానంలో నిలిచాడు.