చిలగడదుంపలు తింటే తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల రక్తకణాలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగం. ఇవి రోగాలు రాకుండా రక్షిస్తాయి. అందువల్ల చిలగడదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే విటమిన్ ఏ కూడా ఎక్కువగా లభిస్తుంది. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తం తయారవుతుంది. అందువల్ల రోజూ ఒక చిలగడదుంపను అయినా సరే ఉడకబెట్టి తినాలి.