బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. వరల్డ్ సమ్మిట్లో పాల్గొన్న ఆయనకు భారత్ క్రికెటర్లలో ఇష్టమైన క్రికెటర్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు కోహ్లీ, ద్రవిడ్ అంటే ఇష్టమన్నారు. ‘విరాట్ అసాధారణ లీడర్. మైదానంలో అద్భుతంగా వ్యవహరిస్తాడు. ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాడు. అలాగే ద్రవిడ్ ఇంగ్లాండ్లో సెంచరీ చేసి అదగరగొట్టాడు’ అని పేర్కొన్నారు.