అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ జెండర్‌పై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖెలిఫ్ జెండర్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టు ఒకటి లీక్ కావడం, అందులో పలు కీలక విషయాలు వెల్లడి కావడంతో క్రీడా వర్గాలు షాక్‌కు గురవుతున్నాయి. ఈ నేపథ్వంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ఆమె స్వర్ణాన్ని వెనక్కి తీసుకోండి. ఆమె రూల్స్‌కి విరుద్దంగా గెలిచింది అని ఒలింపిక్ సంఘానికి సూచించాడు.