బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మరోసారి కుప్పకూలింది. కొత్త బంతితో కివీస్ పేసర్లు చెలరేగిపోగా.. భారత్ రెండో ఇన్నింగ్స్లో 106 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించింది. సర్ఫరాజ్ ఖాన్ అవుట్ తర్వాత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో న్యూజిలాండ్ ముందు 107 పరుగుల స్వల్ప టార్గెట్ నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌటైంది.