Women’s T20 World Cup: టీ20 మహిళా వరల్డ్ కప్..రేపు పాక్‌తో తలపడనున్న టీమిండియా
టీ20 మహిళా వరల్డ్(T20 World Cup) కప్‌లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా, పాకిస్థాన్ జట్లు రేపు తలపడనున్నాయి. రేపు సాయంత్రం 06.30 గంటలకు పాక్, ఇండియా మ్యాచ్ జరగనుంది.
టీ20 మహిళా వరల్డ్(T20 World Cup) కప్‌లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. ఐసీసీ టీ20 మహిళా వరల్డ్ కప్2023 (Women’s T20 World Cup) శుక్రవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ నిర్వహిస్తుండగా ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా, పాకిస్థాన్ జట్లు రేపు తలపడనున్నాయి. గ్రూప్-బిలో ఇండియా, పాక్ జట్లు ఉన్నాయి. రేపు సాయంత్రం 06.30 గంటలకు పాక్, ఇండియా మ్యాచ్ జరగనుంది.
పాక్ తో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో భారత జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన(Smriti mandhana) ఆడటంపై సందేహం వ్యక్తం అవుతోంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడదనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. జట్టుకు సంబంధించిన వివరాల్ని బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ శనివారం మీడియాకు తెలియజేశారు. భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారని, అయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం మ్యాచ్‌లో ఆడకపోవచ్చునని తెలిపారు.
స్మృతి మంధాన(Smriti mandhana) వేలికి గాయం అవ్వడంతో ఆమె మ్యాచ్‌కు దూరం కావొచ్చని తెలిపారు. కనిత్కర్ చెప్పిన వివరాల ప్రకారంగా స్మృతి మంధాన ప్రస్తుతం కోలుకుంటోందని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదిన వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో స్మృతి(Smriti mandhana) ఆడే అవకాశం ఉందని తెలిపారు.
కెప్టెన్ హర్మన్(Harmanpreet Kaur) కూడా జట్టుతో ఆడేందుకు సిద్ధమవుతోందని, రెండు రోజులుగా హర్మన్ బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచుల్లో హర్మన్ ప్రీత్ కౌర్ కు గాయం అయ్యిందన్నారు. అందుకే ఆమె మ్యాచ్ ఆడటం లేదన్నారు. పాకిస్థాన్ మ్యాచులో కూడా ఆడుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం టీమిండియా మహిళా జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి గతంలో పాకిస్తాన్‌తో ఆడిన అనుభవం ఉంది. దీంతో ఈ అనుభవంతో భారత ఆటగాళ్లు పైచేయి సాధించే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. పాకిస్థాన్ తో మ్యాచ్ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లతో తదుపరి మ్యాచులు ఆడనుంది. ఈసారి మహిళా వరల్డ్ కప్(T20 World Cup) లో భారత జట్టు కప్ గెలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.