ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్కతా నైట్రైడర్స్(Kolkata night Riders) మధ్య నేడు రసవత్తర పోరు సాగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం(Victory) సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్కతా నైట్రైడర్స్(Kolkata night Riders) మధ్య నేడు రసవత్తర పోరు సాగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం(Victory) సాధించింది. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి గుజరాత్ టైటాన్స్ 204 పరుగులు చేసింది.
కోల్కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. గుజరాత్(Gujarat Titans) బ్యాటర్లలో సాయి సుదర్శన్ 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ 63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శుభ్మన్ గిల్ 39 పరుగులు చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టాడు. సుయాన్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
ఆఖర్లో కష్టాల్లో పడిన కోల్కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) జట్టును రింకూ సింగ్ ఒంటి చేత్తో టీమ్ ను గెలిపించాడు. 48 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు. రింకూ సింగ్ సిక్సర్ల మోతతో అభిమానులు మరింత ఉత్సాహంగా కనిపించారు. ఆఖరి ఓవర్లో కోల్ కతాకు 29 రన్స్ కావాల్సి ఉండగా రింకూ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఐదు సిక్సులు బాది కోల్ కతా నైట్ రైడర్స్ కు విజయాన్ని అందించాడు. కాగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఈ ఐపీఎల్(IPL)లో ఇది తొలి ఓటమి కావడం విశేషం.