ఈ ఏడాది ఆసియా కప్2023 (Asia cup 2023)ని టీమిండియా (Team India) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మహిళల జట్టు (India Womens Team) కూడా ఆసియా గేమ్స్‌లో విక్టరీని కైవశం చేసుకుంది. ఆసియా గేమ్స్‌లో మొదటిసారి భారతీయ మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలో భారత జట్టు ఈ ఘనతను సాధించింది.
📸📸 We've done it! 👏 👏
Congratulations to #TeamIndia as they clinch a Gold 🥇 Medal at the Asian Games! 🙌 🙌
ఆసియా క్రీడల ఫైనల్లో (Asia Games) శ్రీలంకపై 19 పరుగుల తేడాతో టీమిండియా ఉమెన్స్ జట్టు విజయం సాధించింది. దీంతో ఈ ఏడాది ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకూ రెండో స్వర్ణ పతకాన్ని భారత్ పొందింది. ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో ఇండియా మొత్తం 11 పతకాలను గెలుచుకుంది.
Indian women's cricket team wins Gold at the #AsianGames with a dominant win over Sri Lanka, led by 18-year-old sensation #TitasSadhu's bowling brilliance (3 for 6). Congratulations to the team and support staff for this historic achievement! 🇮🇳 @BCCIWomenpic.twitter.com/md78olzIxS
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మొదట టీమిండియా ఉమెన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్మృతి మందానా 46, జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులు చేసి స్కోరును ముందుకు కదిలించారు. తక్కువ పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక ఉమెన్స్ జట్టును భారత బౌలర్లు దెబ్బతీశారు.
లంక ఉమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 19 పరుగుల తేడాతో ఇండియా విక్టరీ సాధించింది. భారత బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 3 వికెట్లను పడగొట్టింది. కేవలం 6 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. భారత మరో బౌలర్ రాజేశ్వరీ గౌక్వాడ్ 2 వికెట్లను పడగొట్టింది.