»India Vs Sri Lanka Final Weather Report Rain Forecast Colombo Asia Cup 2023
India-vs-sri Final: ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలుస్తుందా.. రేపు మ్యాచ్ జరగకపోతే ఎవరు ఛాంపియన్ ?
బంగ్లాదేశ్‌తో జరిగిన ఓటమిని మరిచిపోయి టీమిండియా ప్రస్తుతం ఆసియా కప్ ఫైనల్‌పై దృష్టి సారించింది. సెప్టెంబర్ 17 న భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
India-vs-sri Final: బంగ్లాదేశ్‌తో జరిగిన ఓటమిని మరిచిపోయి టీమిండియా ప్రస్తుతం ఆసియా కప్ ఫైనల్‌పై దృష్టి సారించింది. సెప్టెంబర్ 17 న భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఒకవేళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం వర్షం కురిస్తే ఏమవుతుంది. రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుందా లేదా ఈసారి కూడా విజేతగా ఇరు జట్లను ప్రకటిస్తారా ? ఫైనల్‌కి సంబంధించిన అన్ని అప్డేట్లను తెలుసుకుందాం..
సెప్టెంబర్ 17న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. వాతావరణ శాఖ ప్రకారం.. శనివారం కొలంబోలో వర్షం 90 శాతం వరకు పడే అవకాశం ఉంది. సోమవారం కూడా కొలంబోలో వర్షం పడే అవకాశాలు 70 శాతం వరకు ఉన్నాయి. అంటే సెప్టెంబర్ 17న మ్యాచ్ వర్షం కారణంగా ఈ మ్యాచ్ సెప్టెంబర్ 18న జరగనుంది. సరిగ్గా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో జరిగినట్లే ఇది. అయితే, వర్షం కారణంగా రెండు రోజులు ఆట చెడిపోయి, 20-20 ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేకపోతే, ట్రోఫీని భారత్-శ్రీలంక మధ్య పంచుకుంటారు.
వర్షం కారణంగా మొత్తం ఆసియా కప్ 2023 అంతరాయం కలిగింది. చాలా మ్యాచ్‌లు పూర్తి కాలేదు. కొన్ని మ్యాచ్‌లను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే శ్రీలంకలో టోర్నీ జరగడం, వర్షం అంతరాయం కలిగించడం ఇదే తొలిసారి కాదు. 2002లో ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించినప్పుడు సెప్టెంబర్‌లో టోర్నీ నిర్వహించగా వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించలేకపోయింది. విశేషమేమిటంటే 2002లో కూడా భారత్, శ్రీలంకలు ఫైనల్ చేరి ట్రోఫీని పంచుకోవాల్సి వచ్చింది. ఫైనల్లో వాతావరణమే కాదు ఫిట్నెస్ కూడా పెద్ద సమస్యగా మారింది. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అందుకే రిజర్వ్ ప్లేయర్‌గా వాషింగ్టన్ సుందర్‌ని శ్రీలంకకు పిలిచింది టీమ్ ఇండియా. మరోవైపు, శ్రీలంకకు చెందిన మహిష్ తిక్షణ కూడా గాయం కారణంగా ఫైనల్‌కు దూరమయ్యాడు. అందుకే సహన్ ఆర్చిచిగేను జట్టులోకి తీసుకున్నారు.