యాషెస్ సిరీస్లో 1-4 తేడాతో ఘోర పరాజయం పాలవ్వడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే శ్రీలంక సిరీస్, అలాగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లపై బోర్డు కఠిన నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. ప్లేయర్లు పార్టీలు చేసుకోవడం, మద్యం సేవించడం, విహారయాత్రలకు వెళ్లడంపై నిషేధం విధించినట్లు సమాచారం.