WPL: భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ ఇప్పటివరకు అత్యధిక ధర దక్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ.1.90 కోట్లకు దక్కించుకుంది. సిమ్రాన్ బేస్ ధర రూ.10 లక్షలు కాగా.. ఢిల్లీ, గుజరాత్ పోటీపడ్డాయి. అలాగే, ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ బేస్ ధర రూ.50 లక్షలు కాగా.. ఆమెను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.