అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు ఘోర ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘ఈ మ్యాచ్‌లో తమ జట్టు సమిష్టిగా విఫలమైంది. మేం అందివచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేదు. అదే మా ఓటమిని శాసించింది. పింక్ బాల్‌తో ఆడడం సవాల్‌తో కూడుకున్నది. ఆస్ట్రేలియా మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. తరువాతి టెస్టుపై ఫోకస్ చేస్తాం’ అని పేర్కొన్నాడు.