ఇటీవల జరిగిన డైమండ్ లీగ్‌లో గాయం కారణంగా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానానికి పరిమితమైయ్యాడు. పారిస్ ఒలింపిక్స్‌లోనూ గాయం కావడం వల్ల ఇబ్బంది పడిన ఈ అథ్లెట్ రజత పతకం సాధించాడు. అయితే వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కి ఫిట్‌గా తిరిగి వస్తానని తాజాగా నీరజ్ మాటిచ్చాడు.