న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ తాజాగా ప్రకటన విడుదల చేసింది. వాషింగ్టన్ సుందర్ రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు ఆడుతున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 152 పరుగుల భారీ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో అతడిని మిగితా రెండు టెస్ట్‌లకు టీమిండియాలో స్థానం కల్పించారు.